- వికారాబాద్ జిల్లా పరిషద్ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి , జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రతి కార్యకర్త ఒక్క సైనికుడిలా పని చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వికారాబాద్ జిల్లా పరిషద్ చైర్మన్ పట్నం సునీత రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నూతన ఉత్తేజంతో ముందుకు సాగాలని తెలిపారు.
ఆదివారం సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్ ప్రేమ నగర్ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నాయకులు మహిపల్ యాదవ్ ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల సంజీవ రెడ్డి, వీరేందర్ గౌడ్, ఇలియస్ షరీఫ్, మనెపల్లి సాంబశివరావు, సాజిద్, మునఫ్ ఖాన్, రషీద్, నజీర్, ఇస్మాయిల్ పాల్గొన్నారు.