- కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు
నమస్తే శేరిలింగంపల్లి : కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కాలనీ అధ్యక్షులు భేరీ రామచంద్ర యాదవ్ తెలిపారు.
గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో శ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ ఆలయం ఎదురుగా మంచినీటి పైప్ లైన్ సమస్యని జలమండలి అధికారులకు తెలియజేసి పైపులను మరమ్మత్తులు చేయించారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసినందుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.