మియాపూర్ డివిజ‌న్ బ‌స్తీవాసుల‌కు వ‌ర‌ద స‌హాయం వెంట‌నే అందించాలి

  • మియాపూర్‌ డివిజన్ ఎంసీపీఐ(యూ) కమిటీ కార్యదర్శి కన్నా శ్రీనివాస్

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారీ వర్షాల కారణంగా నష్టపోయిన మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని బస్తీవాసులకు వరద సహాయం వెంటనే అందించాలని ఎంసీపీఐ(యూ) మియాపూర్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి కన్నా శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం చందానగర్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాంష్‌కు ఆయన బస్తీలవాసులతో కలిసి వినతిపత్రం అందజేశారు. మియాపూర్‌ డివిజన్‌ పరిధిలో ఓంకార్‌ నగర్‌ బస్తీతోపాటు ఇతర అనేక బస్తీలకు చెందిన వారు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

చందాన‌గ‌ర్ డీసీ కార్యాల‌యానికి ర్యాలీగా వెళ్తున్న ఎంసీపీఐ(యూ) నాయ‌కులు, బస్తీవాసులు

చాలా మంది గుడిసెల్లో నివసించే వారేనని, అందరూ కూలి పనులు చేసుకునే వారని, వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయారన్నారు. వారందరికీ వెంటనే ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల సహాయం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌డీడబ్ల్యూ గ్రేటర్‌ సహాయకురాలు లలిత, గ్రేటర్‌ నాయకురాలు విమల, ఓంకార్‌నగర్‌ కార్యదర్శి రంగస్వామి, గ్రేటర్‌ కమిటీ సభ్యుడు అనిల్‌, ఏఐఎఫ్‌డీవై గ్రేటర్‌ నాయకుడు మధు, ఏఐఎఫ్‌డీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఎంసీపీఐ(యూ) ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు, ప‌లువురు బ‌స్తీవాసులు ర్యాలీగా త‌ర‌లివెళ్లి చందాన‌గ‌ర్ డీసీ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న చేప‌ట్టారు.

చందాన‌గ‌ర్ డీసీ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న తెలుపుతున్న నాయ‌కులు, బ‌స్తీవాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here