హోప్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళ‌ల‌కు కుట్టు మెషిన్ల పంపిణీ

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని నల్లగండ్లకు చెందిన మహిళలు సుజాత, మంజులల‌కు హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా సోమ‌వారం కుట్టు మెషిన్ల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ.. పేద‌ల‌కు స‌హాయం అందించ‌డం కోసం హోప్ ఫౌండేష‌న్ ఎల్ల‌ప్పుడూ ముందుంటుంద‌న్నారు. హోప్ ఫౌండేష‌న్ సేవ‌లు అభినంద‌నీయ‌మ‌న్నారు. స‌మాజంలోని పేద‌ల‌కు ఇలాగే స‌హాయం చేసేందుకు దాతలు ముందుకు రావాల‌న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, సునీత ప్రభాకర్ రెడ్డి, తెరాస నాయకులు మిర్యాల రాఘవ రావు, బ్రిక్ శ్రీను, బాలరాజు, మిర్యాల ప్రీతం పాల్గొన్నారు.

మ‌హిళ‌ల‌కు కుట్టు మెషిన్ల‌ను అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here