నమస్తే శేరిలింగంపల్లి : భర్తతో కలిసి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 30వ తేదీన రాములు తన భార్య రాములమ్మను బిర్యానీ తీనేందుకు హోటల్ కు వెళ్లారు. అయితే రాములు ఒక్కడే ఇంటికి వచ్చాడు.

తన కూతురు కోసం చుట్టు పక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో రాములమ్మ తల్లి వెంకటమ్మ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి నుంచి వెళ్లినప్పుడు నలుపు చీర, నల్లని గీతలు కల్గి ఉన్న తెలుపు రంగు జాకెట్ ధరించి ఉన్నదని, ఎత్తు 5ఫీట్లు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.





