కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శేరిలింగంపల్లి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన కవితను వారి నివాసంలో చాంద్ పాషా ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. నిజామాబాద్ ప్రజా ప్రతినిధులు అధిక మెజార్టీతో గెలిపించినందుకు వారికి చాంద్ పాషా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కవిత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కాంక్షించారు. కవితను కలిసిన వారిలో టిఆర్ఎస్ నాయకులు ఫుల్గమ్ మల్లేష్, రాజు మల్లయ్య తదితరులు ఉన్నారు.






