- అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ జాతీయ కార్యదర్శి ఆర్ మోహన్ సింగ్ నాయక్
మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ ధర్మ గురు తపస్వి రామారావు మహరాజ్ కు ఆదివారం ఘనంగా నివాళులుర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలిండియా బంజార సేవా సంఘ్ జాతీయ కార్యదర్శి ఆర్ మోహన్ సింగ్ మాట్లాడుతూ భారత దేశం లో గల 12 కోట్ల బంజారా గిరిజనుల ఆరాధ్య దైవమైన బాల బ్రహ్మచారి జగత్ గురు శుక్రవారం రాత్రి ముంబై హాస్పిటల్ లో స్వర్గస్తూ లయ్యారని, వారి మృతి బంజారా సమాజానికి తీరని లోటు అన్నారు. బంజారా జాతిని జాగృతం చేయడం కొరకు గత 80 సంవత్సరాల భోజనం స్వీకరించకుండా పాలు, పండ్లు మాత్రమే స్వీకరించారని అన్నారు. భారత దేశం మొత్తం తిరుగుతూ బంజారాలను మద్యపానం, చెడు అలవాట్ల నుండి విముక్తి కలిగించేందుకు కృషి చేశారన్నారు.

సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి దశరథ్ నాయక్ మాట్లాడుతు నాటి ఇందిరా గాంధీ నుంచి నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుకు రామారావు మహారాజ్ సేవలు చూసి ఆహ్చర్య పోయారన్నారు. డాక్టర్ రేట్, పద్మ శ్రీ అవార్డులతో రామారావు మహరాజ్‌ను ప్రభుత్వం సత్కరించారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూజ హాస్పిటల్ డాక్టర్ రాంసింగ్ నాయక్, రాంజనేయులు నాయక్, ఏఈ సక్రం నాయక్, తెరాస పార్టీ మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, తండా నాయకులు సీతారాం నాయక్, స్వామి నాయక్, రెడ్యానాయక్, తిరుపతి నాయక్ రాములు నాయక్, లక్పతి నాయక్, కృష్ణ నాయక్, జితేందర నాయక్ గోపి నాయక్ మధు నాయక్ రవీందర్ నాయక్, లక్ష్మన్ నాయక్, సచిన్ నాయక్, మారుతీ నాయక్, మోహన్ నాయక్, రాకేష్ నాయక్ రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.





