– శేరిలింగంపల్లి ఉద్యమకారుల ఐక్యవేదిక తీర్మాణం
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్లోని విద్యానికేతన్ స్కూల్లో ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారుల ఐక్యవేదిక సమావేశం జరిగింది. సీనియర్ ఉద్యమకారులు, తారానగర్ తుల్జాభవానీ ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాబోయే గ్రేటర్ ఎన్నికలలో ఉద్యమకారులకు పెద్దపీట వేయాలని తీర్మానం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ఉద్యమకారులకు గత ఐదు సంవత్సరాలుగా పదవులు రాలేవని, ఎలాంటి న్యాయం జరగలేని, ఈ క్రమంలో రాబోయే ఎన్నికలలో ఉద్యమ కారులకు అవకాశం కల్పించేలా పార్టీ అదిష్టానంపై ఒత్తడి తేవాలని చర్చించారు. ఏదేమైన గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకొవడం ఉద్యమకారులు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.

సీనియర్ ఉద్యమకారుడు మిద్దెల మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు చెన్నంరాజు, సంగారెడ్డి, కలివేముల వీరేశం గౌడ్, రవీందర్ యాదవ్, ప్రొ. పి వై రమేష్, శేఖర్ గౌడ్, సలీం, డా.రమేష్, మల్లేష్, వినోద్ కుమార్, యాదగిరి, చారి, వసంత్ కుమార్, ప్రమీల, ఈశ్వర్, జి.బలరాజ్, అశోక్ కుమార్, మన్నే శ్రీనివాస్, బాబూమియా, మహమ్మద్ సర్జాజ్, విజయ లక్ష్మి, పద్మ, మహమ్మద్ సలీం, హనీఫ్, లోకేష్ రెడ్ తదితరులు పాల్గొన్నారు





