వ‌ర‌ద బాధితుల‌కు కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ స‌హాయం పంపిణీ

హఫీజ్ పేట్/మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజ‌న్ల ప‌రిధిలోని వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో బాధితుల‌కు కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌లు బుధ‌వారం రూ.10వేల ప్ర‌భుత్వ ఆర్థిక స‌హాయాన్ని పంపిణీ చేశారు. హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని అంబేద్క‌ర్ న‌గ‌ర్‌, సాయిన‌గ‌ర్‌, మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని రాజారాం కాల‌నీల‌లోవారు ఆర్థిక స‌హాయం అంద‌జేశారు.

బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. వ‌ర‌ద బాధితుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఈ రూపాదేవి, ఏఈ అనురాగ్, బిల్ కలెక్టర్ ఆనంద్, మురళీ కృష్ణ, నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శాంతయ్య, గౌతమ్ గౌడ్, రామకృష్ణ గౌడ్, సయ్యద్ సాదిక్, హుస్సేన్, సంజు, ముజీబ్, కమోజీ, పాషా, రఘునందన్, షరీఫ్, నాగరాజ్, యాదగిరి, అశోక్, పద్మ, శిరీష పాల్గొన్నారు.

వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ పూజిత గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here