మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం మాదాపూర్ పోలీసులు, తలసేమియా, సికిల్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం మాదాపూర్ సాయి గార్డెన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 104 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం రక్తదాతలను డీసీపీ వెంకటేశ్వర్లు అభినందించారు. వారికి ధ్రువపత్రాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రఘునందన్ రావు, సీఐ రవీంద్ర ప్రసాద్, ఎస్ఐలు రామ్ మోహన్ రెడ్డి, వీర ప్రసాద్, స్థానిక కాంగ్రెస్ నాయకుడు గంగల రాధాకృష్ణ యాదవ్, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.