నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని డిఎల్ఎఫ్ వద్ద “ఆణ్ని ఫాస్ట్ ఫుడ్” సెంటర్ ను ఏర్పాటు చేయగా.. రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు కార్పొరేటర్ కు పూలబొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు.
అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ స్వయం ఉపాధి మార్గం ఎంచుకుని ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కస్టమర్లకు మంచి సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు షీతల్ సింగ్, నందు సింగ్, గోపాల్ యాదవ్, నయీమ్, సాగర్ సింగ్, గోపాల్ సింగ్, దీపక్ సింగ్, నీరజ్ సింగ్, కుల్దీప్ సింగ్, వినీత్, శివ, సోను, తేజ, శరత్, రోహిత్ పాల్గొన్నారు.