నమస్తే శేరిలింగంపల్లి : ఊరికి వెళ్లొస్తానని బయలుదేరిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. హనుమాన్ నగర్ లో నివసించే విజయగిరి రాహుల్ (23) పెద్ద పల్లిలోని తన గ్రామం ఐన శ్రీరాంపూర్ వెళ్ళొస్తానని తన అన్నకు చెప్పి వెళ్లాడు. అయితే ఆ రోజు రాత్రి తన అన్న రాహుల్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. చుట్టూ పక్కల వారిని, బందువులను అడిగి తెలుసుకున్న ఎలాంటి సమాచారం లేకపోవడంతో మాదాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాహుల్ ఆచూకీ తెలిసిన వారు కింది నెంబర్లకు సమాచారం అందించాలని 9502694176, 9700221137 తెలిపారు. రాహుల్ సుమారు 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు, నలుపు ఛాయా, నలుపు జుట్టుతో బక్క పలుచగా ఉంటాడని చెప్పారు.