నమస్తే శేరిలింగంపల్లి : రాబోయే రంజాన్, శ్రీరామ నవమి పండుగల దృష్ట్యా అన్ని సంఘాల పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరిగేలా పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తుందని, ఏవైనా సమస్యలు తలెత్తితే తమకు సమాచారం అందించాలని మాదాపూర్ పోలీసులు వారికి తెలిపారు. పండుగలను ఐకమత్యంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.