హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల నేపథ్యంలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. సోమవారం హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు వద్ద, రామకృష్ణనగర్, జనప్రియ,హేమ దుర్గ, మియపూర్ మెయిన్ రోడ్డు, ప్రజయ్ సిటీ తదితర ప్రాంతాల్లో ఆయన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మియపూర్ సీఐ వెంకటేశ్, జీహెచ్ఎంసీ ఈఈ చిన్నారెడ్డి, డీఈ రూపాదేవి, ఏఈ అనురాగ్, ఏసీపీ సంపత్, శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్ లతో కలిసి పర్యటించారు.

గడిచిన రెండురోజులుగా కుండపోత వర్షంతో అపార్టుమెంట్లు, కాలనీలలో వరద నీరు భారీగా చేరింది. ఈ క్రమంలో ఆరెకపూడి గాంధీ ఆయా ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. రానున్న రెండు రోజుల్లో మళ్ళీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అవసరం అనుకుంటే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, గౌరవాధ్యక్షుడు వాలా హరీష్ రావు, నాయకులు శాంతయ్య, వెంకటయ్య, విష్ణు, ప్రసాద్, సుధాకర్, పూర్ణచందర్ రావు, వెంకట్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





