మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, కృషి నగర్ లోని ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి రూ.70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న వరదనీటి కాలు నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యంతో సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, సీఎం కెసిఆర్ మార్గదర్శకంలో మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగుతున్నామన్నారు. నాణ్యత విషయంలో రాజి పడకూడదని , పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు హనుమంతు , ఆచారి తదితరులు పాల్గొన్నారు.