తారానగర్ లో కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ ప‌ర్య‌ట‌న

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అకాల వర్షం కారణంగా వరద నీటి ప్రవాహంతో తారానగర్ లోకి కొట్టుకొచ్చిన చెత్తాచెదారాన్ని, మట్టిని త్వరితగతిన తొలగించేలా చర్యలు తీసుకోనున్నట్లు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం తారానగర్ లోని ప్రతి గల్లీలో స్థానికులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. రెండు రోజుల్లో కాలనీని యథా స్థానానికి‌ వచ్చేలా చూస్తామన్నారు. లింగంపల్లి నాలా వద్ద కొట్టుకు వచ్చిన చెత్తాచెదారాన్ని జేసీబీతో తొలగింపజేశారు. తారానగర్ లో రోడ్లకు కొట్టుకువచ్చిన మట్టిని, చెత్తాచెదారాన్ని తొలగింపజేయాలని శానిటేషన్ అధికారులకు రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. పలువురి ఇళ్ల వద్ద ఉన్న వేస్టేజీని అప్పటికప్పుడు టిప్పర్, జేసీబీ ల‌తో తొలగింపజేశారు‌. ఆయన వెంట ఏఎంహెచ్ఓ డాక్టర్ రంజిత్, టీఆర్ఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, తారానగర్ పార్టీ బస్తీ కమిటీ అధ్యక్షుడు దుర్గం జనార్థన్ గౌడ్, పవన్ గౌడ్, నట్ రాజ్, వెంకటేశ్, ఖలీం తదితరులు ఉన్నారు.

తారాన‌గ‌ర్‌లో రోడ్డుపై చేరిన డ్రైనేజీ నీటిని ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
జేసీబీతో చెత్త చెదారాన్ని తొల‌గింప‌జేయిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here