నమస్తే శేరిలింగంపల్లి: టిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మల్లారెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల 50 వేల మంది ఉండగా.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందటంతో సంతోషంగా ఉన్నారని, వారు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.