నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం చండూరు మండలంలో దోనిపాముల గ్రామం ఇంచార్జ్, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది ఏండ్లలో చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, తెరాస నాయకులు జనార్దన్ రెడ్డి, అక్బర్ ఖాన్, కార్తిక్ గౌడ్, కొండల్ రెడ్డి, అంజద్ , ఆఫ్సర్ గ్రామస్థులు పాల్గొన్నారు.