నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ భవానిపురం కాలనీలో మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారి శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. కాలనీవాసులు ఏర్పాటు చేసుకున్న ఊరేగింపు రథంలో అమ్మవారిని పెట్టి భగవన్నామ సంకీర్తనలు, కోలాటాలతో కాలనీలోని వీధుల్లో తిరుగుతూ నిమజ్జన కార్యక్రమం చేశారు. రథం దాత, భవానిపురం కాలనీ మాజీ అధ్యక్షులు లక్ష్మీ కాంత్ రెడ్డి పాల్గొన్నారు.