నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో భారతినగర్, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీ వెంకన్న, ప్రాజెక్టు ఆఫీసర్ మాన్వి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, గంగాధర్ రెడ్డి తో కలిసి అర్హులైన 569 మంది లబ్దిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పించన్ల పథకం చాలా గొప్పదని అన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీల భేదం లేకుండా అరులైన అందరికీ ఆసరా ఫించన్లు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మానవతావాది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ నాగమణి, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, MIG తెరాస ప్రెసిడెంట్ భాస్కర్, తెరాస నాయకులు ఆదర్శ్ రెడ్డి, సత్యనారాయణ, రఘునాథ్, రమేష్, కృష్ణ యాదవ్, శ్రీకాంత్, అక్బర్ బాయి, సల్లావుద్దీన్, సురేష్ నాయక్, సాయి, మల్లేష్ గౌడ్, మరియు రూప రెడ్డి, జ్యోతి, ఇందిర, దేవి అనిత, సంధ్య, జయమ్మ, స్వర్ణలత తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.