- వైకుంఠ రథం వాహనాన్ని ప్రారంభించి లబ్ధిదారుడుకి అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందని ప్రభుత్వ విప్ అరె కపూడి అన్నారు. మియాపూర్ విలేజ్ కి చెందిన బెగరి యాదగిరికి వైకుంఠ రథం వాహనం మంజూరైంది. ఈ సందర్భంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి లబ్దిదారుడికి ఆ వాహనాన్ని ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ వైకుంఠ రథం వ్యక్తి మరణానంతరం అతని అంతిమ యాత్రకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. దళిత బంధు దేశానికే ఆదర్శమని, ఈ సంవత్సరంలో 2000 మంది లబ్ధిదారులకు అవకాశం కలిపిస్తామని అన్నారు. దళితులలో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని, లబ్ధిదారులను గుర్తించి వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కలిపించే విధంగా సహకరించాలని కోరారు. దళిత బంధు పథకం అమలు లో లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇచ్చామని, అధికారులు ఎల్లవేలలో అందుబాటులో ఉంటారన్నారు. దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు, ప్రభుత్వ విప్ గాంధీలకు లభిదారుడు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు గంగాధర్ రావు, BSN కిరణ్ యాదవ్, మహేందర్, MD ఇబ్రహీం, శివ, కలకిందిడి రోజా, లత, కల్పన పాల్గొన్నారు.