అసహాయులకు కొండంత అండ ‘ఆసరా’

  • ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
  • 551 మంది లబ్దిదారులకు ఆసరా పింఛన్లు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సర్కిల్ కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ కమ్యూనిటీహాల్ లో వద్ద ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డీసీ వెంకన్న, ప్రాజెక్టు ఆఫీసర్ మాన్వి, కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి అర్హులైన 551 మంది లబ్దిదారులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పించన్ల పథకం చాలా గొప్పదని సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీ ల భేదం లేకుండా అరులైన అందరికీ ఆసరా ఫించన్లు అందిస్తున్న గొప్ప మానవతా వాది కేసీఆర్ అని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారిగా మరింత మందికి ఆసరా ఫించన్ల ను అందిస్తామని పేర్కొన్నారు. అసహాయులకు ‘ఆసరా’ కొండంత అండగా నిలుస్తున్నదని, వృద్ధులకు ఆర్థిక భద్రత ‘ ఆసరా సంఘంలో సగర్వంగా తలెత్తుకొని జీవించేలా వారిలో ఆత్మవిశ్వాసం నింపినదన్నారు.  వృద్ధాప్య పింఛన్‌ అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గింపు, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ లో నూతనంగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు.

కొత్తగూడ కమ్యూనిటీహాల్ లో ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధ

మొత్తం మీద 45 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కోసం 12 వేల కోట్ల ఖర్చు చేస్తుంది. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు, బీడి కార్మికులకు ప్రతి నెలా రూ. 2016 వికలాంగులకు రూ. 3016 ఇస్తున్నారు మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా ఇచ్చి మహిళల నీటి కష్టాలు తీర్చిన గొప్ప నేత సీఎం అన్నారు.  లింగంపల్లిలో ఒక అవ్వ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మా ఇంటి పెద్ద కొడుకులాగా ఉండగా మాకేం సమస్య ఉంటది బిడ్డా అన్నది. పిల్లల చదువుల కోసం గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేశాం. నాడు కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోతే.. ఇప్పుడు 24 గంటల కరెంటు వల్ల పెద్ద మొత్తంలో పంటలు పండుతున్నాయి. అర్హులైన వారికి తప్పకుండా పింఛన్లు అందిస్తాము. ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నాం, నిరంతర కరెంటు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, రైతుబంధు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, డబుల్ బెడ్ రూమ్లు ఇస్తున్నాం, కొత్త పింఛన్లు ఇస్తున్నాం.. ఇన్ని చేస్తున్న సీఎం కేసీఆర్ గారిని గుర్తించుకోవాలని అన్నారు. ఉచితాలు బంద్ చేయమని అనుచిత సలహా ఇస్తున్నారు బిజెపి వాళ్లు. అంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బంద్ చేయాలంట అని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో 600 రూపాయలు మాత్రమే పింఛన్ ఇస్తుందని ఇతర రాష్ట్రాలలో అమలు అవుతున్న పించన్ల వివరాలను అంకెల తో సహా వివరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజు, కొండాపూర్ డివిజన్ తెరాస పార్టీ ప్రెసిడెంట్ అబ్బుల కృష్ణ గౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, తెరాస సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, అన్నం శశిధర్ రెడ్డి, రక్తపు జంగంగౌడ్, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి యాదవ్, గణపతి, రజనీకాంత్, హిమామ్, సంజీవ, లక్ష్మి నారాయణ, స్వామి సాగర్, నీలం లక్ష్మణ్, ఎండి ఖాసీం, షేక్ రఫీ, కె. నిర్మల, రూప రెడ్డి, మరియు తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • మాదాపూర్ డివిజన్ పరిధిలో..

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హల్ లో చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్, హఫీజ్పెట్ డివిజన్ల పరిధిలోని అర్హులైన 1000 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎల్ డీసీ సుధాంష్ , ప్రాజెక్టు ఆఫీసర్ ఉషారాణి, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత జగదీశ్వర్ గౌడ్ తో కలిసి అర్హులైన 1000 మంది లబ్దిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోAMOH కార్తిక్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, అధ్యక్షులు వాలా హరీష్ రావు, తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హల్ లో ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here