మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ విమోచన దినోత్సవాల్లో భాగంగా గురువారం భాగ్యనగర్ అమ్మవారి టెంపుల్ వద్ద నుండి మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి నాయకులు రవికుమార్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ రజాకార్ల అరాచకాలు, ఆ కృత్యాల నుంచి విముక్తి కలిగించేందుకు హైదరాబాద్ సంస్థాన ప్రజలకు విమోచనం కలిగినట్టుగానే భావించాలని, అందుకే 17 వ తేదీన విమోచన దినోత్సవంగా జరుపుకోవడం కరెక్ట్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లేష్, రఘునాథ్ యాదవ్, ఆదిత్య, పద్మ, రేణుక, అరుణ , మల్లికా, నాగు బాయ్ పాల్గొన్నారు.

మహిళా మోర్చా ఆధ్వర్యంలో భాగ్యనగర్ అమ్మవారి టెంపుల్ వద్ద భారీ బైక్ ర్యాలీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here