మౌలిక వసతుల కల్పనే ధ్యేయం – కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా ఫేస్ 2 కాలనీలో Ghmc అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు. కాలనీలో చేపట్టే సీసీ రోడ్డు పనుల గురించి కాలనీ వాసులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దుసుకోపోతుందన్నారు. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, కాలనీవాసులు రాజయ్య, సత్తయ్య, విద్యాసాగర్, రమణరెడ్డి, కిషోర్, మధు సూధన్ రావు, పకిరయ్య, గంగాధర్, సత్యనారాయణ, అధికారులు ఏఈ శివ ప్రసాద్, వర్క్ ఇన్ స్పెక్టర్ రాజు పాల్గొన్నారు.

కాలనీలో నెలకొన్న సమస్యల గురించి కాలనీ వాసులతో చర్చిస్తున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here