నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో దళితుల్లో మరింత ఆత్మస్థైర్యం నిండిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండకి చెందిన మహేష్ కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన మొబైల్ షాప్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారీగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధావుడని, దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దళితులలో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి దళిత బంధు ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, నాయకులు పొడుగు రాంబాబు, పద్మారావు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, మల్లేష్ గౌడ్, సాయి, మల్లేష్ యాదవ్, సత్యనారాయణ, రమణయ్య, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.