నమస్తే శేరిలింగంపల్లి: క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ యు. వాణి అన్నారు. నల్లగండ్ల శ్రీ చైతన్య పాఠశాలలో 2021-22 పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు పొందిన విద్యార్థినీవిద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వాణి మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా చదువును నిర్లక్యం చేయవద్దని, మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను సన్మానించి మెరిట్ సర్టిఫికేట్లను, మెడల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం శివరామకృష్ణ, ఆర్ఐ అనిత, డీన్ కోటేశ్వరరావు, ఎంకే రంగా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.