నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో దళితుల్లో మరింత ఆత్మగౌరవం పెరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సుదర్శన్ నగర్ కాలనీలో దుర్గేశ్ కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన టెంట్ హౌజ్ ను మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. దళితులలో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు.
ఈ పథకం వివిధ యూనిట్ల ద్వారా లబ్దిదారులకు అందజేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా ప్రారంభించిన టెంట్ హౌజ్ పలు వివాహా, శుభకార్యాలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం లబ్దిదారుడు దుర్గేష్ మాట్లాడుతూ టెంట్ హౌజ్ మంజూరవడంతో జీవనోపాది లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు రవి యాదవ్, పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, రమణయ్య, సల్లావుద్దీన్, రంగస్వామి, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, పవన్, తదితరులు ఉన్నారు.