రెండో రోజూ ప్రజాసంగ్రామ యాత్రలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర లో రెండో రోజు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మద్దతు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు బస్వాపూర్, ఇంద్రమ్మ కాలనీ, భువనగరి పట్టణంలోని హుస్నాబాద్, అంబేద్కర్ విగ్రహం, బస్టాండ్, ప్రిన్స్ కార్నర్ కేఫ్, రామ్ మందిర్, హైదరాబాద్ చౌరస్తా మీదుగా టీచర్స్ కాలనీ వరకు కొనసాగింది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఎక్కడైనా ప్రాజెక్టులు కడితే రైతులు సంతోషపడాలే కానీ భూములిచ్చిన రైతులు బాధపడుతున్నారన్నారు. ఏ రైతును చూసినా బాధతోనే కన్పిస్తున్నారని చెప్పారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లించి డబుల్ బెడ్ రూం సాకుతో ఇప్పటి వరకు పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్రమే అయినా రేషన్ షాపుల్లో కేసీఆర్ ఫోటో పెట్టుకుని తానే బియ్యం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పేదలకు అందించే రేషన్ బియ్యానికి సంబంధించి ఒక్కో కిలో బియ్యానికి కేంద్రం 29 రూపాయలు ఇస్తుంటే కేసీఆర్ ఒక్క రూపాయి మాత్రమే భరిస్తున్నాడని తెలిపారు. కరెంట్, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, బిజెపి ప్రముఖులు, సీనియర్ బిజెపి నాయకులు రంగస్వామి ముదిరాజ్, చిన్న కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రెండో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ తో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here