నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో నిర్వహించిన బీహార్ క్రాఫ్ట్ ఫెయిర్ సందర్భంగా పలువురు కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. యునైటెడ్ స్టేట్స్ లో నివసిస్తూ చిన్మయి నృత్యాలయా సంస్థను స్థాపించి ఎందరో ప్రవాస భారతీయులకి కూచిపూడి నృత్యంలో శ్రీదేవి ముంగర శిక్షణ ఇస్తున్నారు. శ్రీదేవి శిష్య బృందం యునైటెడ్ స్టేట్స్ నుండి విచ్చేసిన కళాకారులతో శిల్పారామంలో కూచిపూడి నృత్యప్రదర్శన ఇచ్చారు. ప్రణమామ్యహం, పూర్వరంగం, మామవతు శ్రీ సరస్వతి, కృష్ణ శబ్దం, ఎందరో మహానుభావులు, ఖమాస్ తిల్లాన, దేవా దేవం భజేయ తదితర అంశాలపై కళాకారులు నవ్య, నేహా, తన్వి, దీప్త, హరిణి, సాయి నిత్య, శ్రావ్య, హంసిని, శిఖ సూరపనేని లు ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు.