నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్, హఫీజ్ పెట్ డివిజన్ల పరిధిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడుతామని మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్, హాఫీజ్ పెట్ డివిజన్ల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గత వారం మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ మంజూరు చేసిన నిధులు డివిజన్ పరిధిలో నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై జీహెచ్ఎంసీ అధికారులతో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, మౌళిక వసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. హాఫీజ్ పెట్ డివిజన్ ఏఈ ప్రతాప్, మాదాపూర్ డివిజన్ ఏఈ ప్రశాంత్ ఉన్నారు.