నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయల కల్పనకు సుహృత్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుల వినతి మేరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తరగతి గదుల్లో నాలుగు సీలింగ్ ఫ్యాన్లు, నాలుగు ట్యూబ్ లైట్స్ సెట్లను సుహృత్ ట్రస్ట్ సభ్యులు అందజేశారు. అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులందరికి నోట్ పుస్తకాలతో పాటు పాఠశాలకు రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్ సెట్స్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుహృత్ ట్రస్ట్ అధ్యక్షుడు కనకమామిడి నరేందర్ గౌడ్, సభ్యులు బిట్టు బాల్ రాజ్, మెహర్, రమేష్, వెంకటేష్, పాండు తదితరులు పాల్గొన్నారు.