నమస్తే శేరిలింగంపల్లి: దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని అర్హులైన దళిత లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. అందులో భాగంగా పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పకు చెందిన మల్లెల జయ కుటుంబ సభ్యులకు స్విప్ట్ డిజైర్ కారును దళిత బంధు కింద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం తో దళితులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాన్ని తీసుకు రాలేదన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని ఏకైక లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎంపిక చేసిన లబ్ధిదారులు దళిత బంధు పథకాన్ని ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఆదాయ వనరుగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను అర్హులైన లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, భీమని శ్రీను, బస్వరాజ్ లింగాయత్, గోపాల్ యాదవ్, దీప, దళిత బంధు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.