నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి విచ్చేసిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కు బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. జేపీ నడ్డాకు స్వాగతం పలికేందుకు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి వందకు పైగా కార్లతో భారీ ర్యాలీగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు హైదరాబాద్ కు రావడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కలుగుతుందని, పార్టీ బలోపేతానికి మైలురాయిగా మారుతుందని రవి కుమార్ యాదవ్ తెలిపారు. నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను కూడా భారీగా జనసమీకరణ చేసి సభను విజయవంతం చేస్తామని, కేసీఆర్ ప్రభుత్వం ఇక రోజులు లెక్క పెట్టుకోవాలన్నారు. సాలు దొర..ఇక సెలవు దొర.. కేసీఆర్ కి బాయ్ బాయ్ చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కంటెస్టెంట్ కార్పొరేటర్లు కంచెర్ల ఎల్లేష్, రాధా కృష్ణ యాదవ్, రఘునాథ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు, ఆంజనేయులు సాగర్, శ్రీధర్ గౌడ్, భూపాల్ రెడ్డి, నర్సింగ్ రావు, మహిళా మోర్చా కన్వీనర్ పద్మ, రేణుక, మధు యాదవ్, నరసింహ, గణేష్, బాలు, శ్రీనివాస్, వినోద్, అర్జున్, క్రాంతి, కృష్ణ, నరేష్, శ్రీనివాస రెడ్డి, సంతోష్, చెన్నయ్య, సురేష్, అశోక్, రవి, రమణ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.