నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ను ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి బి జయంత్ జై పాండా పరామర్శించారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ను మియాపూర్ ఆల్విన్ కాలనీలోని తన నివాసంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి బి జయంత్ పాండ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని పార్టీ కార్యక్రమాలలో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని బైజయంత్ పాండ ఆకాంక్షించారు. ఆయనతో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు.