నమస్తే శేరిలింగంపల్లి: సుప్రజ గ్రూప్స్, పరంపరా స్వీట్స్ అధినేత తుడి ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు చందా నగర్ లోని క్రిస్టల్ గార్డెన్ లో గురువారం ఘనంగా జరిగాయి. ప్రవీణ్ కుమార్ అభిమానులు, ఆయన సిబ్బంది ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఆర్ అండ్ బి చైర్మన్ శ్రీనివాస్, మున్నూరుకాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, మున్నూరుకాపు ట్రస్ట్ మెంబర్ రౌతు కనకయ్య, కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు ఇంచార్జీ గాలి అనిల్ కుమార్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి నేరుగా కలిసి ప్రవీణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గజమాలలు, మెమొంటోలు, శాలువాలతో సత్కరించి జన్మదిన కేకును కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో సునిల్, సాగర్, ముఖేష్, సుజన్ రెడ్డి, రోహిత్ ముదిరాజ్, విజయ్ గౌడ్, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, మాజీ కౌన్సిలర్లు, వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రవీణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.