నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి కార్యక్రమం భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. డివిజన్ పరిధిలోని శిల్ప పార్క్ లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పట్టణ ప్రగతి నిర్వహించారు. కాలనీలోని చెత్తా చెదారాన్ని, డ్రైనేజీ వ్యవస్థను, మురికి నీటి గుంతలను బాగు చేయించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలను, బస్తీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ ఉన్న డ్రమ్ములను, కూలర్లను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రశాంత్, వాటర్ వర్క్స్ డీజీఎం శ్రీమన్నారాయణ, మేనేజర్ నివర్థీ, శానిటేషన్ ఎస్ఆర్ పి శ్రీనివాస్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు గుమ్మడి శ్రీనివాస్, కాలనీ వాసులు శివ ప్రసాద్, వేణు, గుప్త, రాజు, ప్రసాద్, త్రినాధ్, రమేష్, రవి సింగ్, ఎస్ఎఫ్ఐ ప్రసాద్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తదితరులు ఉన్నారు.