నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఐదో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి ఆవరణలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ నెల 18 వ తేదీ వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతిలో పరిశుభ్రత, పారిశుద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించనున్నట్లు తెలిపారు.
కాలనీలలో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులను,కార్పొరేటర్ కు చెప్పారు. అన్ని కాలనీలు, బస్తీలు ఆదర్శవంతంగా సుందరవనంగా తీర్చిద్ధిదాలని అన్నారు. సీజనల్ వ్యాధులు, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్, ఏఈ సునీల్, ఏఎంఓహెచ్ డాక్టర్ నగేష్ నాయక్, వాటర్ వర్క్స్ మేనేజర్ యాదయ్య, ఎంటమాలజీ ఏఈ నగేష్, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, నాయకులు పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, నటరాజ్, గోపాల్ యాదవ్, రమణయ్య, బసవయ్య, జమ్మయ్య, నర్సింహ, కోదండరెడ్డి, బస్వరాజ్, శ్రీకళ, సౌజన్య, భాగ్యలక్ష్మి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.