అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం – రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షుడు యాదయ్య

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపము వద్ద నివాళి అర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు, అమరవీరులు చేసిన త్యాగాలు ఎన్నటికి మరిచిపోలేనివని అన్నారు. మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘము అధ్యక్షుడు డా.తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ ఉద్యమములో సబ్బండవర్గాలు పోరాడినప్పటికీ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. మొదట్లో ఉద్యోగుల ఫెర్ షేర్ గురించి మొదలైన ఉద్యమం అన్ని వర్గాల కలయికతో నీరు, నిధులు, నియమాకాలు సాధించడానికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగిందన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పి. జగన్మోహన్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో మున్సిపల్ ఉద్యోగులు కీలకమైన పాత్ర నిర్వహించారని, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రోత్సహకము చాలా గొప్పదని అన్నారు. అసోసియేట్ అధ్యక్షులు వి. అశోక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సి హెచ్ కృష్ణ, నాయకులు రవీందర్, మురళి తదితరులు పాల్గొన్నారు.

గన్ పార్కు లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం నేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here