స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి పథకాలు- చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారని, కేసీఆర్ కృషి ఫలితంగానే అన్ని వర్గాల వారికి అభివృద్ధి పథకాలు అందుతున్నాయని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. చందానగర్ పరిధిలోని వేమన వీకర్ సెక్షన్, చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాదించిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దుసుకోపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు మిరియాల రాఘవరావు, జనార్ధన్ రెడ్డి, ఓ.వేంకటేష్, పులిపాటి నాగరాజు, పబ్బ మల్లేష్ గుప్తా, వరలక్ష్మి రెడ్డి, ఉరిటి వెంకటరావు, శ్రీనివాస్ నాయక్, అక్బర్ ఖాన్, యేలమయ్య, నరేందర్, హరిష్ రెడ్డి, యశ్వంత్, కార్తిక్, అమిత్ దూబే, రఘునందన్ రెడ్డి, ఉదయ్, రమేష్, ముఖేష్, రాహుల్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ లోని గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here