నిరుద్యోగ యువతకు మనం గ్రూప్ నిత్య భోజనం – అభినందించిన మాదాపూర్ ఏసీపీ‌ కృష్ణప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో రామచంద్రాపురం పోలీసులు ఆధ్వర్యంలో బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లో జరుగుతున్న పోలీస్ ఉద్యోగ నిమకాల కోసం గ్రామీణ ప్రాంతాలకు చెందిన 300 మంది పేద విద్యార్థులకు మనం గ్రూప్ అండగా నిలిచింది. దూర ప్రాంతాల నుండి భెల్ కు ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతకు ప్రతి రోజు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ పొందుతున్న వారికి సమీపంలో ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మనం గ్రూప్ తనవంతుగా స్వచ్ఛందంగా ముందుకువచ్చి భోజనాన్ని అందజేస్తోంది.

బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లో శిక్షణ పొందుతున్న యువతకు భోజనం వడ్డిస్తున్న మనం గ్రూప్ సభ్యులు

కాగా గతంలో కరోనా సమయంలో వేలాది మందికి మాస్కులు, శానిటైజర్లు అందించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి అండగా నిలిచిన మనం గ్రూప్ కు ఇక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తెలియడంతో గ్రూప్ అడ్మిన్ సురేందర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అభ్యర్థులందరికీ ఆహారాన్ని అందించాలని నిర్ణయించారు. దీంతో గత నాలుగు రోజులుగా ప్రతి రోజూ మధ్యాహ్నం 300 మంది అభ్యర్థులకు ఆహారాన్ని అందిస్తున్నారు. బుధవారం మాదాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, మియాపూర్ సీఐ తిరుపతిరావు పలువురు అధికారులు మధ్యాహ్న భోజన సదుపాయాలను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. శిక్షణ తీసుకునే అభ్యర్థులతో కలిసి భోజనం చేశారు. భోజన వసతి కల్పించిన మనం గ్రూప్ అడ్మిన్ సురేందర్ ని అభినందించారు. ప్రతి రోజు దాదాపు 300 మందికి ఆహారాన్ని అందించడం సామాన్య విషయం కాదని ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్న మనం గ్రూప్ కు అందరూ అండగా నిలవాలని ఏసీపీ కృష్ణ ప్రసాద్ కోరారు. గ్రూప్ సభ్యులు మూర్తి, సాల్వేడర్ (టిల్లు) పోలీసు సిబ్బందితో కలిసి ఆహారాన్ని అందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here