నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సాయికుమార్, రంగారెడ్డి జిల్లా అర్బన్ ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కురుమ కు బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాయికుమార్, శ్రీశైలంలకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కష్టపడి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అదిరోహించాలని ఆకాంక్షించారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మున్ముందు మరెన్నో జరుపుకోవాలన్నారు.