నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గోపనపల్లి తండాలో ప్రజా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీ బాట నిర్వహించారు. కాలనీలో నెలకొన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మంచి నీళ్లు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు తదితర సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సూచించారు. అనంతరం గోపన్ పల్లి తండాలో నూతనంగా నిర్మిస్తున్న భుగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని ప్రతీ కాలనీ, బస్తీల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. నాణ్యతా విషయంలో రాజీ పడకుండా నిర్ణీత సమయంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయాలని కార్పొరేటర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు కైలాష్ సింగ్, ముళగిరి శ్రీనివాస్, ప్రభాకర్, శేఖర్, మన్నే రమేష్, నర్సింగ్ నాయక్, దేవేందర్, వేణు, నరేందర్ గోపనపల్లి తండా వాసులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.