నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఎస్ ఎల్ బి కూచిపూడి కళానిలయం గురువు డాక్టర్ వినీల రావు శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పాహి పాహి గజానన, హిందువుల తిల్లాన, రాధిక కృష్ణ, బృందావన నిలయేహ్, లక్ష్మి ప్రవేశ దరువు, భో శంభో, కళింగ నర్తన తిల్లాన తదితర అంశాలనుప్రదర్శించారు. విరాజ, వైష్ణవి, ప్రీతీ, త్రివేణి, శ్రేయ, రషీదా, చరిత కృష్ణ, గాయత్రీ, స్రవంతి, అలేఖ్య, కళాకారులు ప్రదర్శించి మెప్పించారు. భవ్య శ్రీ, తుమ్మలపల్లి సత్యనారాయణ, డాక్టర్ గౌరీ శంకర్ విశ్రాంత రిజిస్ట్రార్ తెలుగు యూనివర్సిటీ, సుబ్బారావు విచ్చేసి కళాకారులకి జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు.