నమస్తే శేరిలింగంపల్లి: బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యునిగా ఎన్నికవడం శుభ పరిణామమని జాతీయ బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆర్. కృష్ణయ్యను విద్యా నగర్ లోని బిసి భవన్ లో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బిసి హక్కుల కోసం ఉద్యమించిన ఉద్యమకారుడు, బిసి వర్గాల ఆశాజీవి, పేద విద్యార్థుల ఆశా కిరణం ఆర్.కృష్ణయ్య ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, మొర్రి అనిల్, దొంతి బోయిన శ్రీనివాస్ యాదవ్, వంగూరు సర్వేశ్ యాదవ్, దర్శకుడు పెద్ద రాజుల మధు తదితరులు పాల్గొన్నారు.