నాలా పూడిక తీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ లో చేపట్టిన నాలా పూడికతీత పనులను కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం‌ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా కృషి చేస్తున్నామని అన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కూరుకుపోయిన నాలా పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలపూడిక తీత పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. నాలాలో పేరుకుపోయిన చెత్త, మట్టిని పూడిక తీత ద్వారా తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, డీఈ సురేష్, ఏఈ ప్రతాప్, వర్క్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, ఎస్ ఆర్ పీ మహేష్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, మల్లేష్, సబీర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

నాలా పూడిక తీత పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here