నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సందర్భంగా తుక్కు గూడలో ఏర్పాటు చేసిన బిజెపి బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి బిజెపి నాయకులు భారీగా తరలివెళ్లారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 5వేల మందికి పైగా మసీద్ బండ నుంచి ర్యాలీగా బయల్దేరారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.