తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు బిఎన్ రెడ్డి – ఘనంగా 14వ వర్థంతి

నమస్తే శేరిలింగంపల్లి: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకి పట్టుకుని రైతుల కోసం పోరాడిన యోధుడు కామ్రేడ్ బి యన్ రెడ్డి అని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి అన్నారు. వీర తెలగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, ఎంసీపీఐయూ పొలిట్ బ్యూరో సభ్యులు, అమరజీవి కామ్రేడ్ భీం రెడ్డి నరసింహా రెడ్డి 14వ వర్ధంతిని బాగ్ లింగంపల్లి లోని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యాలయం ఓంకార్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. బీఎన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గాదగోని రవి మాట్లాడుతూ నాటి నిజాం నవాబ్ ప్రభుత్వం హయాంలో బానిసత్వానికి విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి తెలంగాణలో 10 లక్షల ఎకరాల సాగు కోసం భూమిని పంపిణీ చేశారన్నారు.దశాబ్దాలుగా నల్లగొండ తదితర ప్రాంతాల్లోని సాగుభూమి కి నీరు అందక రైతాంగం అల్లాడుతున్న సమయంలో పార్లమెంట్ మెంబర్ గా 1996 మార్చి 9న నాటి ఉమ్మడి నల్గొండ జిల్లా,నేటి సూర్యాపేట జిల్లా నాగారం మండలం ప్రగతి నగర్ వద్ద శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువకు శంకుస్థాపన చేసి రైతాంగ సాగు భూములకు నీటిని అందించి సస్యశ్యామలం చేయాలని అని భావించారన్నారు. ఇప్పటికీ ఆనాటి శ్రీ రామ్ సాగర్ రెండవ దశ కాలువ పనులను నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం పనులను నత్తనడకన కొనసాగిస్తుందని ఆరోపించారు. తెలంగాణ పోరాట ఖ్యాతిని ప్రపంచానికి చాటిన కామ్రేడ్ బి ఎన్ పేరును శ్రీ రామ్ సాగర్ రెండవ దశ కాలువకు పెట్టాలని ఎంసీపీఐయూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య , వి. తుకారాం నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఏ. పుష్ప లు పాల్గొన్నారు.

ఓంకార్ భవన్ లో బీఎన్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్న ఎంసీపీఐయూ ‌నేతలు

మియాపూర్ లో…
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసీపీఐయూ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి 14వ వర్ధంతిని మియాపూర్ డివిజన్ పరిధిలో ముజాఫ్ఫార్ అహ్మద్ నగర్ లో ఎంసీపీఐయూ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మియాపూర్ డివిజన్ కార్యదర్శి కన్నా శ్రీనివాస్, ఇస్లావత్ దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుంచే కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించిన జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి వందల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచినా మహనీయుడు బి.ఎన్.రెడ్డి అని అన్నారు. నైజాం కాలంలో రజాకార్లు అల్లరి మూకలు ప్రజలపై చేస్తున్న దాడులు దౌర్జన్యాలను ప్రతిఘటన చేసేందుకు కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పి భాగ్యమ్మ, కర్ర దానయ్య, పల్లె మురళి, ఎల్ రాజు, విమల,వై రాంబాబు, కే రాజు, చందర్, డి మధుసూదన్, సుల్తానా, డి లక్ష్మి, శ్రీనివాస్, ఎస్ రవి, డి నరసింహ రవికాంత్ తదితరులు ‌పాల్గొన్నారు.

మియాపూర్ డివిజన్ లోని ముజాఫర్ నగర్ లో బీఎన్ రెడ్డి చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న దృశ్యం

.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here