గోకుల్ ప్లాట్స్ లో వీధి దీపాల ఏర్పాటుతో నూతన కళ – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: వాహనదారులకు, పాదచారులకు రాత్రి వేళల్లో ఇబ్బందులు లేకుండా వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ ప్రధాన రహదారిపై రోడ్డు డివైడర్ పై రూ. 3 లక్షల అంచనావ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి దీపాల ఏర్పాటుతో కాలనీకి కొత్త శోభ వచ్చిందని అన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మాదాపూర్ డివిజన్, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్ట్రీట్ లైట్ డీఈ నాగమణి, ఏఈ రామ్మోహన్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గోకుల్ ప్లాట్స్ బస్తీ టిఆర్ఎస్ అధ్యక్షుడు బ్రిక్ శ్రీనివాస్, నాయకులు గుమ్మడి శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, సంజీవ రెడ్డి, ప్రసాద్, వెంకట్ రావు, శ్రవణ్, సాయి, వెంకటేశ్వర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

గోకుల్ ప్లాట్స్ వద్ద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here