నమస్తే శేరిలింగంపల్లి:ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని, ప్రతీ బస్తీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఆవరణలో టీఆర్ఎస్ చందానగర్ యువజన నాయకుడు దొంతి కార్తీక్ గౌడ్, దొంతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో రూ. 4.20 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 42 సీసీ కెమెరాలను కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు దాత దొంతి సత్యనారాయణ గౌడ్ ముందుకు రావడం అభినందనీయం అని అన్నారు. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని, సీసీ కెమెరాల ఏర్పాటు పై కాలనీ వాసులకు విస్తృత ప్రచారంతో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వలన కేసుల పరిష్కారం సులభతరం అవుతుందని అన్నారు. కాలనీ వాసులు ముందుకు వచ్చి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
చందానగర్ డివిజన్ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పన కు కృషి చేస్తానని, రోడ్లు ,డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. 42 సీసీ కెమెరాలను చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ గిడ్డంగి లో 6, పోచమ్మ గుడి మెయిన్ రోడ్ లో 4, విష్ణువర్ధన్ రెడ్డి హాస్పిటల్ మెయిన్ రోడ్ దగ్గర 4, వెనుక వైపు 4, మటన్ మార్కెట్ మెయిన్ రోడ్ లో 4, మటన్ మార్కెట్ వెనుక చౌరస్తాలో 4, లింగంపల్లి హనుమాన్ గుడి సంగమేష్ షాప్ దగ్గర 4, చందానగర్ వేముకుంట మజీద్ చౌరస్తాలో 4, చందానగర్ వేముకుంట శ్రీ వేణుగోపాల స్వామి గుడి లో మొత్తం 8 కెమెరాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్ఐ శ్రీధర్, ఎస్ఐ వెంకటేష్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్ రెడ్డి , సీనియర్ నాయకులు దుర్గం వీరేశం గౌడ్, రవీందర్ రెడ్డి , అక్బర్ ఖాన్, నాగేంద్ర బల్లా, వరలక్ష్మి , సునీత, చందానగర్ డివిజన్ యువజన నాయకుడు దొంతి కార్తీక్ గౌడ్ , స్థానిక నాయకులు కృష్ణ దాస్, ఉదయ్, విఘ్నేష్, కుమార్, గణేష్ గౌడ్, అనిల్, సంతోష్, రాజశేఖర్, గౌరవ్, సందీప్ రెడ్డి,సునీత తదితరులు పాల్గొన్నారు.