ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం – గెలాక్సీ అపార్ట్ మెంట్ లో పర్యటించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత , సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల పై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలను అడిగి‌ తెలుసుకున్నారు. గెలాక్సీ అపార్ట్మెంట్ లో నెలకొన్న డ్రైనేజీ ఔట్ లెట్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

గెలాక్సీ అపార్ట్ మెంట్ వాసులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

డ్రైనేజీ, మంచి నీరు, రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబందిత సమస్యలతో పాటు రోడ్డు విస్తరణ చేపట్టి ట్రాఫిక్ సమస్య ను పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు బాలకృష్ణ యాదవ్, రాజేష్ యాదవ్, జీతూ, గెలాక్సీ అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ కిరణ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ వర్మ, జనరల్ సెక్రెటరీ మాధవరావు, జాయింట్ సెక్రటరీ సత్య దినేష్ గుప్తా, ట్రెజరర్ సత్యనారాయణ శాస్త్రి, తేజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సమావేశం లో‌ పాల్గొన్న గెలాక్సీ ‌అపార్ట్ మెంట్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here